అర్హులైన వారికే దళిత బంధు ఇవ్వాలి..

నవతెలంగాణ- డిచ్ పల్లి: రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తమ గ్రామానికి రావద్దని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధనం చేసిన సంఘటన సోమవారం  ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దళిత బంధు లో అర్హులైన వారిని గుర్తించి దళిత బంధు అందజేయాలని వారన్నారు. సోమవారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వాస్తున్నారనే ముందస్తు సమాచారం తో కోందరు దళితులు  గ్రామ శివారులో ముళ్ళ కంచె వేసి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు, ప్రజా ప్రతినిధులు చేరుకుని వారిని సముదాయించారు