– దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
నవతెలంగాణ-హన్మకొండ
తరతరాలుగా అంటరానితనం, కుల వివక్షకు గురవుతు న్న దళితులకు సంక్షేమం, అభివృద్ధి, రక్షణలతోపాటు దళితు ల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి వుంటూ దళిత సాధికారతకు సాధించేందుకు నాణ్యమైన విద్యా,వైద్యాన్ని అందించేవిధంగా రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిపెస్టో లలో హమీలు ఇవ్వా లని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యనందించాలన్నారు.దళిత మ్యానిఫెస్టోపై హనుమ కొండ లో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలొపెతం చేయాలని,విశ్వవిద్యాలయాల పట్ల వివక్షను విడనాడలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్ట ల్‌లు, గురుకులాలలో కనీస సదుపాయలు పెంపొందించాల న్నారు. ఉపాధ్యాయ, లెక్చరర్, ప్రొఫెసర్ల ఖాళీలను భర్తి చే యాలన్నారు. ఎన్నికల హమీలకు చట్టబద్దత కల్పించాలని, హమీలు అమలుచేయని పార్టీల గుర్తింపు ను రద్దు చేయా లని డిమాండ్ చేశారు. దళితబంధు పథకానికి రూ.10 లక్షల నుండి రూ.25లక్షలకు పెంచాలని,దళిత బంధు పథ కం లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యే ల నుండి తీసివే సి అన్ని పథకాల్లాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానాన్ని అమ లు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కొరారు. దళిత చి రువ్యాపారులు ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగొలు చేయాల ని,చిరు వ్యాపారులకు వివిధరంగాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. దళితబంధుతోపాటు ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకు లింకేజిని తొలగించి పతకాలను మంజూ రు చేయాలన్నారు.దళిత వాడలను ప్రత్యేక పంచాయతీ లు గా మర్చాలన్నారు. భూ సంస్కరణ అమలు చేయాలని, భూ మిలేని దళిత కుటుంబానికి భూ పంపిణీని చట్టబద్దంగా పంపిణీ చేయాలన్నారు. పేదలకు పంపిణి చేసిన భూముల ను ప్రజా ప్రయోజల పేరుతో స్వాధినం చేసుకొవద్దన్నారు. నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకరావాల న్నారు. విదేశాలలో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు వున్న అంబేద్కర్ విద్యానిధి పథకానికి రూ.20లక్షల నుండి వాస్తవ ఖర్చుల ఆధారంగా రూ.50లక్షలకు పెంచాలని కోరారు. గృహాలకు ఉచిత విద్యత్‌ను 200యూనిట్లకు పెంచాలన్నా రు. దళితవాడలలో,మండల,జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ భ వనాలను నిర్మించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ ఎస్‌డిఎఫ్ బడ్జెట్‌ను దారి మళ్లించకుండా దళితుల అభివృద్ధికి ఖర్చు చేయాలన్నా రు.రాజ్యంగ పీఠికను ప్రతి విద్యాలయాల్లో ప్రతి రోజు ప్రమా ణం చేయించాలన్నారు. మహనీయులైన పూలే, అంబేద్కర్ ల సమానత్వ సిద్దాంతాన్ని ప్రచారం చేయాలన్నారు. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లను పెంచాలని,ప్రవెట్ రంగంలో రిజ ర్వేషన్‌లను అమలు చేయాలన్నారు. వ్యవసాయ, గృహ తది తర అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించా లని, ప్రమాద, ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించాలన్నారు. నిరుద్యోగ యువతకు,ఉపాధి,ఉద్యోగాలు కల్పించాలన్నారు. దళితులపై దాడుల నివారణకు ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
అంటరానితనం నిర్మూలనకు చర్యలు
తీసుకొవాలన్నారు. ఉపాధి హమీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని,పనిదినాలను వంద నుండి 200 రోజులకు,కనీస వేతనాన్ని 800 లకు పెంచాలని,కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీం కొర్టు తీర్పు ప్రకారం నెలకు 20 వేల జీతాన్ని చెల్లించాలన్నారు.మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని చేయాలన్నారు. గృహలక్ష్మీ పథకానికి 3 లక్షల నుం డి 7 లక్షలకు పెంచాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని కొనసాగించాలని, ఇప్పటికే నిర్మించిన ఇళ్ళను పేదలకు ఇవ్వా లని, మధ్యలో అగిపొయిన ఇళ్ళను పూర్తిచేసి రొడ్డు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ సరఫరా చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని హోమ్‌లెస్ ప్రజలకు,కార్మికులకు పక్కాషెల్టర్లను నిర్మించాలన్నారు. మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలని,తెలంగాణ వైతాళి కులు భాగ్యరెడ్డి వర్మ, గద్దర్ తదితరుల విగ్రహలను ట్యాంకు బండ్‌పై ఏర్పాటు చేయాలన్నారు. పల్లె,బస్తి దవఖానాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపెతం చేసి నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. కౌలు రైతులకు వ్వవసాయ పథ కాలైన రైతు బంధు,రైతు భీమా తదితర పధకాలను అమలు చేయాలన్నారు. రైతుబంధు మాదిరిగా రోజువారి వ్యవ సా య కూలీలకు కూలీబీమా ప్రవేశపెట్టాలన్నారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర, గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ జాక్ చైర్మన్ డాక్టర్ మంద వీరస్వామి, డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలువేరు బిక్షపతి, రాష్ట్ర మహిళ కార్యదర్శి బొర్ర సంపూర్ణ, రాష్ట్ర నాయకులు కొమ్ముల కరుణాకర్, కులవివక్ష పోరాట సమితీ జిల్లా కార్యద ర్శి మంద సంపత్,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల సందిప్,తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు తూముల సదానందం, నాయకులు మేకల అనిత,సుధాకర్, రాజేంద్రప్రసాద్, బౌతు రాధ, సరోజన, వసంత, రాజు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.