బొడ్రాయి పండుగలో దళితులకు అవమానం

Dalits are humiliated in Bodrai festival– పట్టినాగులపల్లిలో అగ్రవర్ణాల దాడి
– పోలీస్‌ స్టేషన్‌లో దళితుల ఫిర్యాదు
– ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌
నవతెలంగాణ-గండిపేట్‌
హైదరాబాద్‌ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న నార్సింగి మున్సిపాలిటీలోని వట్టినాగుల పల్లి లో బొడ్రాయి పండుగ సందర్భంగా దళితులకు అవమానం జరిగింది. దళితులు బోనాలు తీసుకెళ్తున్న సం దర్భంగా అగ్రవర్ణాల వారు కొందరు దాడి చేశారు. దళిత మహిళలు బోనాలు తీసుకెళ్లేందుకు వీల్లేదంటూ అవమానించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అగ్రకులస్తులు బోనాలు చేసిన తర్వాత మీరు చేసుకోవాలంటూ చెప్పడంతో ఉద్రిక్త వాతవారణం నెలకొంది. తమను కులం పేరుతో దూషించారని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ కిందపడేశారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ దళితులం దరూ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేశారు.