– కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని బొడకొండ గ్రామానికి చెందిన దండు కిరణ్ అంబోత తండా బావిలో అనుమానస్పదంలో సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొడకొండ గ్రామానికి చెందిన దండు కిరణ్ 22 ఏండ్లు. శనివారం రాత్రి కిరణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో చుట్టు పక్కల, బంధులకు పోన్ సంప్రదించినా సమాచారం అందలేదు. దీంతో కిరణ్ తల్లిదండ్రులు మంచాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కిరణ్ బంధువులు వెతుకు తున్న నేపథ్యంలో అంబో త తండా బావిలో కిరణ్ మృతదేహం దొరు కగా వెంటనే పోలీసులకు సమా చారం అందించారు. దీంతో పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి దండ్రుల ఫిర్యాదు మెరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.