రేపు చేవెళ్లలో జరిగే కాంగ్రేస్ దళిత, గిరిజన డిక్లరేషన్ బహిరంగ సభను విజయవంతం చేయండి: దండు రమేష్

నవతెలంగాణ – భూపాలపల్లి
రేపు చేవెళ్లలో జరిగే కాంగ్రేస్ పార్టీ దళిత, గరిజన డిక్లరేషన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రేస్ పార్టీ దళిత విభాగం జిల్లా ఛైర్మన్ దండు రమేష్ కోరారు. ఈ బహిరంగ సభ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన జరగనుంది. ఈ తెలంగాణ రాష్టంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎస్సి, ఎస్టి లను అనేకరకాలుగా మోసం చేసిందని..మేము అడగకున్న తెలంగాణ రాష్టానికి దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని, మేము అడకకున్న దళితులకు మూడు ఎకరాల భూమి అని, మేము అడగక పోయిన దళిత బంధు అని, ఇంకా తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక ఈ రాష్టంలో అధికార పార్టీ నాయకుల చేతిలో దళితులను అనేక ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, దళితుల హత్యలు, దళితులను లాక్ అప్ డెత్ లు చేయడం, దళితుల మీద లైంగికదాడులు, దళిత గుడాల మీద అర్ధరాత్రి దాడులు చేయడం, దళిత, గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కుని వాళ్ళ మీద రాజ్యహింసా చేసి కేసులు పెట్టడం లాంటివి విపరీతంగా పెరిగిపోయాయి. గిరిజనులు ఆడగక పోయినా కూడా 12 శాతం రిజర్వేషన్ అని గిరిజనులను ఆశపెట్టి వాళ్ళ ఓట్లు వేయించుకుని రిజర్వేషన్ చేయక గిరిజనులను మోసం చేశారు. వీటి అన్నిటి మీద ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం  దళితులను, గిరిజనులను గత తొమ్మిడున్నర ఏళ్లుగా అనేక రకాలుగా మోసం చేస్తూనే ఉంది. రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్టంలో దళిత, గిరిజనులకు ఏవిధమైన విధానాలు ఉంటాయో ముందే డిక్లరేషన్ చేయడానికి కాంగ్రేస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖార్గే ప్రకటించనున్నారు. కావున భూపాలపల్లి జిల్లాలోని దళిత, గిరిజన కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు, అన్ని గ్రామశాఖల అధ్యక్షులు, దళిత, గిరిజన కులసంఘాలు, కాంగ్రేస్ పార్టీ అభిమానులు అందరూ అధికసంఖ్యలో పాల్గొని ఈ దళిత గిరిజన డిక్లరేషన్ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు.