హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్ హెడ్, జనరల్ మేనేజర్‌గా దారాసింగ్ నాయక్ కె బాధ్యతలు స్వీకరించారు. ఈ జోన్‌లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని 332 శాఖలు ఉన్నాయి. దాదాపుగా రూ.36,031 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి కామర్స్ డిగ్రీ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. సెంట్రల్ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో.. వివిధ ప్రాంతాల్లో పని చేసిన విశేష అనుభవం కలిగి ఉన్నారు.