గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని పనిచేయాలి దాసరి సుధాకర్ 

నవతెలంగాణ- గోవిందరావుపేట
సీతక్క గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు సైనికుల వలె పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరి సుధాకర్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో  జిల్లా ఎస్.సి.సెల్ ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు  ఆధ్వర్యంలో ఎస్.సి.సెల్ మండల అధ్యక్షుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి సుధాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, కష్టాల్లో ఉన్న ప్రతి మనిషికి సహాయం చేసే మానవతవాది సీతక్క ని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలబడి, తనకు తోచిన సహాయం చేస్తూ, ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి  నిత్యం పని చేసే నాయకురాలు దొరకడం మన అదృష్టమని ఇంకో నాలుగు నెలలు మనందరం కష్టపడి సీతక్కని గెలిపించాలని కోరారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వాలు కూడా సహాయం చేయకుండా ఉన్న సమయంలో కూడా, కరోనా కాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రజల అవసరాలను తీర్చిన గొప్ప మనిషి సీతక్క అని, పేద ప్రజల ఆకలిని ఎరిగిన నాయకురాలు అని, అలాంటి సీతక్క గారిని గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. వరదల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ సీతక్క  మాత్రం ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించి ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూనే, వారికి నిత్యావసర సరుకులు అందించి, వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని కోరారని, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాని ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నించారు. మానవత్వానికి నిలువెత్తు రూపం సీతక్క గారని, ఒక పేద కుటుంబంలో పుట్టి తన కష్టాన్ని నమ్ముకుని పేరు,ప్రఖ్యాతులు  సంపాదించుకున్న వ్యక్తి అని, సేవాభావంతో ముందుకు సాగుతున్న వ్యక్తి తనని అన్నారు. కావున దళితులందరూ ఏకమై సీతక్క  గెలుపే ప్రధాన ఎజెండాగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లాలోని ఎస్.సి.సెల్ మండల అధ్యక్షులు మట్టేవాడ తిరుపతి, మైస ప్రభాకర్, పడిదల సాంబయ్య, తాడ్వాయి వావిలాల రాంబాబు, పల్లికొండ యాదగిరి, కర్నే సత్యం, సునార్కని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.