
గురుకుల పాఠశాలలో చదివి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనందులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత స్థానలలో స్థిరపడాలని స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి సోమవారం అన్నారు. మండలంలోని ఉప్పల్వాయి షెడ్యూల్ కులాల వసతి గృహంలో విద్యార్థులకు పుస్తకాలు, నోటుబుక్కులు, ఏకరూప దుస్తులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా దశరథ్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రతిపక్ష నాయకులు వారు పాలించే రాష్ట్రాలను పరిశీలన చేసి మాట్లాడాలని, చేతగాని దద్దమ్మల్ల, ఏది దొరుకుతాది మాట్లాడడం మంచిది కాదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ సహకారంతో వసతి గృహంలో 150 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షులు నారాయణరెడ్డి, సర్పంచ్ కొత్తొల్ల గంగారం, ఎంపిటిసి ఉమాదేవి దత్తాద్రి, ఉప సర్పంచ్ సరస్వతి, మండల బి.ఆర్.ఎస్ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, వార్డెన్ మమత, నర్సింలు, రాజయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.