నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కుటుంబ సమగ్ర సర్వే చేస్తున్న అధికారులకు డేటా ఎంట్రీలో శిక్షణ తరగతులను మంగళవారం రోజు జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులలో మండలంలోని 30 గ్రామ పంచాయతీల సెక్రటరీలు వివిధ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. డాటా ఎంట్రీ ఎటువంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా సర్వే వివరాలు నమోదు చేయాలని సర్వే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ అధికారితో పాటు జుక్కల్ ఎంపీడీవో జిపి కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.