
నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్ పల్లి లో ఇటీవల విదుడల చేసిన నీట్ ఫలితాల్లో 7వ బెటాలియన్ లో కాంట్రక్ట్ సిబ్బంది గా పనిచేస్తున్న నాగమణి – సత్యనారయణ దంపతుల కుమార్తె శ్రీహర్షిత స్టెట్ లెవల్ లో 281 ర్యాంక్ సాధించిందని,నెషనల్ లెవల్ లో -10788 ర్యాంక్ సాదించి గాంధీ మెడికల్ కాలేజి హైద్రాబాద్ లో ఎంబిబిఎస్ సిటును సాదించినందుకు గాను 7వ బెటాలియన్ కమాండెంట్ బి. రాం ప్రకాష్ శ్రీ హర్షితను శాలువతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా కమాండెంట్ మాట్లడుతూ శ్రీ హర్షిత చదువులకు బెటాలియన్ తరుపున సహాకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్ కె. బాస్కర్ రావు,ఎఓ సి. హంసరాణి, అర్. ఐలు అర్. సర్దార్ నాయక్, బి. అనిల్ కుమార్, యల్. మహేష్, యం. నరేష్, బి. శ్యాంరావు, అర్. యస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.