నవతెలంగాణ-శాయంపేట
చిన్నప్పుడే తల్లి మరణిం చగా, తండ్రి అన్ని తానై తల్లి లేనిలోటు లేకుం డా నిరుపే దగా ఉన్నప్పటికీ ఇద్దరు కు మార్తెలను పెంచి పోషించా డు. గుండె పోటుతో బాధప డుతూ మరణించగా ఇద్దరు కూతుళ్లు తండ్రి చితికి తల కొరివి పెట్టి కుమారులు లేనిలోటును పూడ్చివేశారు. వివరాల్లోకి వెళితే… మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన కొండి రాజశేఖర్ కడు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. భార్య 10ఏళ్ల క్రితం మరణించగా ఇద్దరు కుమా ర్తెలు శ్రీనిధి, శివానీలను తల్లి లేని లోటు లేకుండా అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశాడు. పెట్రోల్ బంకులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటు న్నా డు. గత రెండునెలల క్రితం ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. శుక్రవారం గుండెపోటు రావడంతో ఎంజీఎం లో చికిత్స పొం దుతూ మరణించాడు. అతని బౌతికకాయాన్ని కొప్పుల గ్రామానికి తీసు కురా గా ఉండడానికి ఇల్లు కూడా లేదు. గ్రామస్తుల సహకారాలతో అతని కి దహ న సంస్కారాలు నిర్వహించగా ఇద్దరు కుమార్తెలు తండ్రి చితికి నిప్పంటించి తమ రుణాన్ని తీర్చుకున్నారు. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది