నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టే గడువును ఈనెల ఆరో తేదీ వరకు సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాల కోసం https://tseamcetb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.