– చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించిన సర్పంచ్ తిరుపతి
– పరిస్థితి విషమించి చికిత్స పోందుతూ మృతి
నవతెలంగాణ – బెజ్జంకి
గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్టు శనివారం ఎస్ఐ ప్రవీన్ రాజు వెల్లడించారు.గత పదిహేను రోజులుగా బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో సంచరిస్తూ ఆకస్మాత్తుగా పడిపోయిన గుర్తు తెలియని వ్యక్తిని సర్పంచ్ టేకు తిరుపతి చికిత్స నిమిత్తం అంబులెన్స్ యందు శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుని కుడి చేతిపై అంజమ్మ, రవి అనే పేర్లతో పచ్చబొట్టు గుర్తులున్నాయని, సుమారు 50 నుండి 55 ఎండ్ల వయస్సుంటదని.. మృతదేహన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ యందు భద్రపరిచినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుని వివరాలతో అచూకీ తెలిసిన వారు 8712667324 పోన్ నంబరును సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.