– అధికారులకు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో దాదాపు 55 నుంచి 60 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. వరి, పత్తి, వేరుశనగ ఉత్పత్తి, నాణ్యతలో నంబర్ వన్‌గా నిలిచిందని గుర్తుచేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ కె. హన్మంతు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అన్ని శాఖల ఎండీలు, కార్పొరేషన్ల బాధ్యులు ఉన్నారు.