– వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 30లోపు వైఎస్‌ఆర్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనంపై తగు నిర్ణయం తీసుకుంటామని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానమైన చర్చ జరిగినట్టు తెలిపారు.
విలీనంపై కాంగ్రెస్ నుంచి స్పష్టత రాకుంటే రాబోయే సాధారణ ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలోకి దిగుతామని తెలిపారు. 119 నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌టీపీ పోటీ చేస్తుందన్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.