జూనియర్‌ సివిల్‌ జడ్జిగా దీక్షా బట్టు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే)గా దీక్షా బట్టు ఎన్నికయ్యారు. 2021-22 తెలంగాణ జేసీజే నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆమె చదువులో ఎప్పుడూ ఉత్తమ ప్రతిభ కనబరిచే వారు. ఎల్‌ఎల్‌బీలో రెండు బంగారు పతకాలను సాధించారు. పీజీలాసెట్‌లో ప్రథమ ర్యాంకు పొందారు. మొదటిసారి పరీక్ష రాసి జేసీజే ఫలితాల్లో ఆమె ఈ ఘనత సాధించారు. దీక్షా బట్టు తెలంగాణ కోఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ సభ్యురాలు డాక్టర్‌ కిరణ్మయి కూతురు కావడం విశేషం.