– జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర
నవతెలంగాణ-భూపాలపల్లి
క్రీడలలో ఓటమి విజయానికి నాంది అని జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కప్ 2023 బుధవారంతో ముగిశాయి. గత మూడు రోజుల నుండి వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు వివిధ క్రీడలను నిర్వహించారు. ముగింపు సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల మండలమైన పలిమెల జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానంలో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో రాష్ట్రస్థాయిలో మన జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చి రాష్ట్ర స్థాయిలో కచ్చితంగా ప్రథమ స్థానంలో నిలుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీడాకారులు నియమ నిబంధనలతో ఉంటారన్నారు. గెలుపొందని విద్యార్థులు అధైర్య పడవద్దని ఓటమి విజయానికి నాంది అనే విధంగా ఉండాలని ధైర్యాన్ని నింపారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేసిన యువజన క్రీడల శాఖ అధికారిని శ్రీ బుర్ర సునీత ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనిల్ కుమార్, సి హెచ్ ఓ రాజయ్య, క్రీడా కోచులు క్రీడాకారులు పాల్గొన్నారు.