నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ని అసెంబ్లి ఎన్నికలలో ఓడించాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థుల కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ సెన్స్ కళాశాల ముందు పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1200 వందల మంది విద్యార్థుల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ లో ఉద్యోగాలు నోటిఫికేషన్స్ రాక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని, గత తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రైవేట్ యూనివర్సిటీ లను తీసుకువచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసారని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్య విదానం రాష్ట్రంలో అమలు చేయవద్దని, రాష్ట్రంలో శ్రీ చేతన్య, నారాయణ విద్యాసంస్థలను రద్దు చేయాలని, పి.డి.ఎస్.యూ విద్యార్థి మేనిఫెస్టో ను రాబోయే ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కమిటీ ఉపాధ్యక్షుడు శివ సాయి, యూనివర్సిటీ నాయకులు అక్షయ్, ఆకాష్, దేవిక, లహారి, ప్రణయ, అనూష, రమేష్ తదితరులు పాల్గొన్నారు.