– వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను బలపరచాలని సీహెచ్.రంగయ్య పిలుపు
నవతెలంగాణ-నర్సంపేట
బీజేపీ అనుకూల శక్తులను ఎన్నిక ల్లో చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎం) వ రంగల్ జిల్లా చింతమల్ల రంగయ్య కోరా రు. మంగళవారం సీపీఐ(ఎం) కార్యాల యంలో జిల్లా కమిటీ సభ్యులు అనంతగి రి రవి అధ్యక్షతన నిర్వహించిన పట్టణ క మిటీ విస్తృతస్థాయి సమావేశంలో రంగ య్య మాట్లాడారు.దేశంలో బీజేపీ అధికా రంలోకి వచ్చి తొమ్మిదేండ్లు గడిచిపో యిన అట్టడుగులోని వ్యవసాయ కార్మికు లు, దళితులు, పేద లు కార్మికుల జీవన ప్రమాణాలు ఏమా త్రం మెరుగు పడలేద న్నారు. నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి అనేక సమస్యలను ప రిష్కరించకుండా ప్రపజలు నిర్మించుకు న్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, బ్యాంకింగ్ బీఎస్‌ఎన్‌ఎల్, విమానయా నం, రైల్వేలను, బొగ్గు ఉత్పత్తి సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజె ప్పిందన్నారు. ప్రయివేటీకరణ చేయడాని కి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూను కుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను మొత్తంగా కారుచౌకగా ఆధాని కంపెనీకి అప్పజెప్తోందన్నారు. దేశంలోమతాన్ని కేంద్రంగా చేసుకొని మత విద్వేషాలను రగిలిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు మత కల్లోలాను సష్టిస్తుందని విమర్శిం చారు. ఇటివల మణిపూర్‌లో అమానుష సంఘటనలు ఇందుకు రుజువు చేస్తుంద న్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మతకలహాలు జరిగే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాలతో వెనక్కి తీసుకొన్న రైతు వ్య తిరేక చట్టాలను తిరిగి అమలు చేసే అవ కాశాలు లేకపోలేదన్నారు. నేడు దేశంలో నిరుద్యోగ సమస్యలా విల యతాండవం చేస్తుందన్నారు. దేశంలో రాష్ట్రంలో పార్ల మెంటు, అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రా భల్యం తగ్గిన తర్వాత ప్రజల హక్కులు ప్రజాతంత్రవాదనలకు సమస్త ప్రజానీకా నికి సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించే పార్టీలు లేకుం డా పోయా యని తెలిపారు. కమ్యూని స్టులు చట్టస భల్లో లేకపోవడం ప్రజలంద రికీ తీవ్ర నష్టమని ప్రజలు గుర్తించాల్సిన అవస రముందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓ డించానికి వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను బలపర్చడం కోసం సీపీఐ(ఎం) నిర్ణయం తీసుకుం టుందని తెలిపారు. ప్రజలు సీపీఐ(ఎం) ఆలోచనలను బలప ర్చాలని కోరారు. ఈ సమావేశంలో సీపీ ఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కొర బోయిన కుమారస్వామి, పట్టణ కార్య దర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ నాయకు లు గడ్డమీది బాలకష్ణ, కందికొండ రాజు, జగన్నాధం కార్తీక్, కలకోట అనిల్, ఎండి ఫరిదా, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమ ణి, ఇంద్ర, విలియం కేరి, లక్ష్మి, యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.