ప్రజావ్యతిరేక విధానాలు మతతత్వ బీజేపీ పార్టీని ఓడించండి..

 – ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
– వేములవాడ నియోజకవర్గ ప్రజలకు సీపీఐ(ఎం) పిలుపు
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి  మూషం రమేష్..
నవతెలంగాణ – వేములవాడ: ప్రజావ్యతిరేక విధానాలు, అవలంబిస్తున్న మతతత్వ బీజేపీని ఓడించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండిఅని  వేములవాడ నియోజకవర్గ ప్రజలకు సీపీఐ(ఎం)   జిల్లా కార్యదర్శి  మూషం రమేష్ పిలుపునిచ్చారు. గురువారం  వేములవాడ సీపీఐ(ఎం)  కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి  ముశం రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం ప్రజలు ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతున్న మతతత్వ బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నది,
బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా తెలంగాణలోని మాత్రమే 3100 కింటాల్ కు ఇస్తామని గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తామని అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తుంది అని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ సామాన్య ప్రజలపై ధరల భారం పెడుతూ బడా కార్పొరేట్ బాబులకు పెట్టుబడిదారులకు  లాభం చేస్తూ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ధరలను తగ్గిస్తామని పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని దొడ్డు రకం వడ్లను కొంటామని అంటుంది ఎన్నికల లబ్ధి పొందడానికి ఇలాంటి హామీలను ప్రకటిస్తున్నారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతులను బలి తీసుకున్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసి  ప్రభుత్వ సంస్థలను, ప్రైవేటుపరం చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్నికల అప్పుడు ప్రజలను మతం పేరుతో కులం పేరుతో అబద్ధాల పథకాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. బీజేపీ విధానాన్ని ప్రజలు గ్రహించి వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి  ఎల్లారెడ్డి, ఎర్రవెల్లి నాగరాజ్, ముక్తి కాంతా అశోక్, మల్లారపు ప్రశాంత్, గురజాల శ్రీధర్, ఒగ్గు గణేష్, తదితరులు పాల్గొన్నారు.