
నవతెలంగాణ- ఆర్మూర్ :
విద్యారంగం, నిరుద్యోగంపై చిత్తశుద్ధి లేని బీఆర్ఎస్, బీజీపీ ప్రభుత్వాలను ఒడించండి. పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నామాల ఆజాద్ అన్నారు. నిరుద్యోగ, విద్యార్థులను మోసం చేసిన పార్టీలను అడుగడుగున నిలదీయలని నిరుద్యోగ, విద్యార్థులకు పి డి ఎస్ యు పిలుపు. ఇవ్వడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ, జిల్లా విద్యార్థులకు ఏమి చేశారు చెప్పి ఓట్లు అడగాలి. సిఎం గారు మీకు ఎందుకు ఓటు వేయాలి, మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా, రెండవ దఫాలో ఒక్క టీచర్, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనందుకు ఓటు వేయాలా అని వారు ప్రశ్నించారు. పట్టణంలో PDSU ఆధ్వర్యంలో కుమార్ నారాయణ్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన డివిజన్ ముఖ్యుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీల నుండి మొదలుకుంటే ప్రభుత్వ పాఠశాలల వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగి ప్రవళిక హత్మహత్యను తప్పుదోవ పట్టిస్తు, రాష్ట్ర ప్రభుత్వం తప్పును వేరే వారిపై నేపం మోపి నిరుద్యోగులపై అభాండాలు వేసిన దుర్మార్గపు ప్రభుత్వం అని వారు విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కుట్రపూరితంగా జ్యాప్యం చేస్తున్న కెసిఆర్, గ్రూప్ 1 పేపర్ లికేజీ రెండవ సారి కూడా నిర్వహణ సరిగ్గా లేక వాయిదా వేయడం, గ్రూప్ 2 రెండు సార్లు వాయిదా వేయడం, DSC లో తక్కువ ఉద్యోగాలతో మోసం చేయడం ఇట్లా అనేక అంశాల్లో ప్రభుత్వ మోసం చేయడమే గాక మరోసారి BRS పార్టీ మేనిపెస్టోలో విద్యారంగం, నిరుద్యోగుల అంశం ఉసే లేకపోవడం కెసిఆర్ కు విద్య, ఉపాధి, నిరుద్యోలపై కపటప్రేమ బయటపడిందని వారు దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్, ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయకుండా విద్యారంగం పట్ల కపట ప్రేమ వలకబోసారన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు కాలే, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించలే, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల భవనాల నిర్మాణాల ఊసే లేదు. మూడున్నర ఏండ్ల నుండి రేయంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయలేదు. విద్యార్థుల సమయానికి అనుకూలంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ఇలా చెప్తూ పోతే విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీను అమలు చేయని నియంత కేసిఆర్ ప్రభుత్వం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో మత చాందస భావాలను పాఠ్యపుస్తకాల్లో చొప్పించి విద్యారంగాన్ని విధ్వంసం చేస్తుంటే అడ్డుకొని చేతకాని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని వారు ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తూ కేంద్రంలో బీజేపీతో వంత పాడుతూ గెంతులేస్తున్న కేసీఆర్ ను, బీజేపీ ప్రభుత్వాల కుటిల రాజకీయాలను నిజామాబాద్ ప్రజలు తీరస్కరించాలన్నారు. ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించే పార్టీలు తెలంగాణ విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ఆయ పార్టీలు ఎన్నికల మేనిపెస్టోలో పేట్టి, గెలిచిన పార్టీలు వాటిని అమలు చేసే దిశగా, విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ సహయ కార్యదర్శులు దుర్గా ప్రసాద్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.