జన సేన నియోజక వర్గం ఇంచార్జిగా డేగల రాము

– జన సేన అశ్వారావుపేట నియోజక వర్గం ఇంచార్జి గా “డేగల”
నవతెలంగాణ – అశ్వారావుపేట
జన సేన తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జి గా డేగల రాము నియమితులు అయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. రాము స్థానికంగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా సేవ లో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.