హైదరాబాద్: యూనివర్శిటీ ల్లో క్యాంపస్ నియామకాలు చేప డుతున్నామని గ్లోబల్ ఫుడ్ డెలివరీ కంపెనీ డెలివరూ తెలిపింది. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యా లయాల నుండి విద్యార్థులను ఉద్యో గాలలో నియమించుకునే లక్ష్యంతో ప్రత్యేక క్యాంపెయిన్‌ను చేపడు తున్నామని పేర్కొంది. హైదరాబాద్‌లో ఉన్న తమ డెవలప్‌మెంట్ సెంటర్‌లో పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని డెలివరూ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ శశి సోమవరపు తెలిపారు. ఇందుకోసం ఐఐఐటి హైదరాబాద్, ఎన్‌ఐటి వరంగల్, చైతన్య భారతీ ఇన్స్‌ట్యూట్ ఆఫ్ టెక్నలాజీ (సిబిఐటి), వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తదితర విద్యాసంస్థల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు చేపట్టాలని యోచించామన్నారు.