నవతెలంగాణ-గండిపేట్
గండిపేట్ మండలం నార్సింగి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, టౌన్‌ప్లాన్ అధికారులు కూల్చివేశారు. బుధవారం నార్సింగి నల్లచెరువు 6వ వార్డు సర్వేనంబర్ 205బై1ల్లో రిటైర్ ఆర్మీ సైనికులకు ఎకరం 33 గుంటల ప్రభుత్వ భూమిని 2001 ల్లో కేటాయించింది. ఆ భూమిని కొంత మంది నార్సింగి కీలక నేతలు అక్రమంగా కబ్జాలు చేసి నిర్మాణాలు చేసినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాదాపు 20 నుండి 30 వరకు నిర్మాణాలను నెలమట్టం చేశారు. మండలంలో ఎవరైన కబ్జాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలతో పాటు కేసు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.