కెజిబివి పాఠశాలను సందర్శించిన డిఇఓ

నవతెలంగాణ- మాక్లూర్: మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. దుర్గ ప్రసాద్ బుదవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను, హాజరు పట్టికలను, విద్యార్థినిలు హాజరు శాతంను పరిశీలించారు. పదద తరగతి విద్యార్థినిల కోసం ప్రత్యేక ప్రణాళికను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాల ప్రత్యేక ప్రణాళిక,  పని తీరును గమనించి, వెనుకబడిన విద్యార్థినిల కోసం ప్రత్యేక కార్యాచరణ ను సిద్ధం చేయాలన్నారు. కళాశాల, పదవ తరగతిలో అందరు విద్యార్థినిలు ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని ప్రగతి ఉన్నారు.