నవతెలంగాణ శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం బస్టాండ్ లో రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ పి అర్పిత చేతుల మీదుగా దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ లు పంపిణీ చేశారు,ఈ సందర్భంగా మేనేజర్ అర్పిత మాట్లాడుతూ,శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో అర్హులైన దివ్యాంగులకు 120 బస్ పాస్ లు పంపిణీ చేశామన్నారు.గతంలో బస్టాండ్ నిర్మాణానికి మండల ప్రజలు, రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని, విద్యార్థులు మండల ప్రజలు, హుజురాబాద్ డిపో బస్సులో ప్రయాణించి డిపోకు ఎంతో సహకరించారని ఆమె తెలిపారు,హుజురాబాద్ డిపోకు సహకరించిన మండల ప్రజలకు, అసోసియేషన్ సభ్యులు కు హుజురాబాద్ ఆర్టీసీ డిపో పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డిపో మేనేజర్ అర్పిత కు శాలువాతో సన్మానించిన రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమంలో రైస్ మిల్ అసోసియేషన్ తనుకు ప్రభాకర్, తనుకు ఓంకారం,శంకర్ లింగం,పాలడుగుల బాపన్న,ఆర్టీసీ సిబ్బంది ఆర్ దేవేందర్ రెడ్డి,గుర్రం స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.