నవతెలంగాణ- కోటగిరి: బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి మండలంలోని గన్నారం, లింగాపూర్, బస్సాపూర్, కొత్తపల్లి తదితర గ్రామాలలో మంగళవారం ఊరూరా ప్రచారం నిర్వహించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి గ్రామంలో ఘనంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు ఆయా గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు గ్రామస్తులు వివరిస్తూ ముందుకు సాగారు అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గ్రామస్తులు హామీ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడలలో నడుస్తామని గ్రామస్తుల పేర్కొన్నారు. ప్రచార పర్వంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి , మండల, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.