– కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగిందని పాలకుర్తి ప్రజలు మార్పు కోరుతున్నా రని ఎర్రబెల్లి ఇంకెన్ని రోజులు మీ పాలన అని ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. మండలంలో ని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు శని వారం కాంగ్రెస్‌లో చేరారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలో చించి ఓటు వేయాలని, ఊసరవెల్లి దయాకర్ రా వు తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార న్నారు. కేసీఆర్ హయాంలో దళిత బంధు, బీసీ బంధు, గిరిజన బంధు, డబుల్ బెడ్ రూమ్, గృ హలక్ష్మి ఇయ్యలే.. అన్నీ బంద్ చేసిన బీఆర్‌ఎస్ సర్కారును కూడా డిసెంబర్ 30 తేదీన బంద్ చేద్దామని ఆమె కోరారు. రాబోయే ఎన్నికల్లో ఈ దగా దయాకర్ రావుని తరిమి కొట్టేందుకు కాం గ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ఒక సైనికులు లాగా పనిచేయాలనీ ఆమె కోరా రు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముద్దం విక్రం రెడ్డి, అచ్చిరెడ్డి రాజశేఖర్, వినోద్ కుమార్, తూ ర్పాటి రాంబాబు, చర్లపెళ్లి రవిశంకర్, అభి నా యక్ తదితరులు పాల్గొన్నారు.