స్థానిక ఉద్యమకారులతోటే అభివృద్ధి సాధ్యం..

– తుంగతుర్తి శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెల్
నవతెలంగాణ – నూతనకల్
ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన స్థానిక ఉద్యమకారుని గేలుపుతోటే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని తుంగతుర్తి శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెల్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మిరియాల అలగనూరు లింగంపల్లి మాచినపల్లి బిక్కు మల్ల లో పెదనేమిల ఎర్రపాడు గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందని కుటుంబ పాలన అంతం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారెంటీ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. స్థానికేతరుడు ఇసుక దందా చేసే వారిని తరిమి కొట్టాలని ప్రజలను కోరారు బీఆర్ఎస్ పార్టీలో 22 సంవత్సరాలు ఉద్యమం చేసి రాజకీయంగా నష్టపోయిన తనను కాంగ్రెస్ పార్టీ స్థానికుడైన మాదిగ సామాజిక వర్గమైన తనకి టికెట్ ఇచ్చిందని మి అందరి ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తనకి మాజీ మంత్రిలు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు అనంతరం ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు నూతనంగా పార్టీలో చేరిన వారికి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జెన్నారెడ్డి వివేక్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న మాజీ ఎంపీపీ లు ఓరుగంటి మోహన్ రావు ,జానయ్య సర్పంచి తీగల కరుణ శ్రీ గిరిధర్ రెడ్డి గోరుగంటి ఉషా రామ్ కిషన్ రావు గుర్రం సత్యనారాయణ ఎం పిటిసిలు పన్నాల రమా మల్లారెడ్డి ,సజ్జన్ నాయక్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు