
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మున్సిపల్ కౌన్సిలర్ కాసుల రోహిత్ అన్నారు. గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా బీర్కూర్ మండలంలోని చించోలి గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ కాసుల రోహిత్ మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగిస్తున్నా యని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ప్రతి గడప గడప కు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలను వివరిస్తూ 1)కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 500 గ్యాస్ సిలెండర్ 2) రైతులకు 2 లక్షల రుణ మాఫీ 3) 4000 వృధ్యాప పెన్షన్ రాన్నున ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ని ఆదరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాజీ హన్మాండ్లు బీర్కూర్ మండల అధ్యక్షులు శంకర్, తోట ప్రభాకర్ గ్రామా అధ్యక్షులు బొంబాయి గంగారాం, కుమార్, మహమ్మద్ఉప సర్పంచ్ ప్రభాకర్, పర్వారెడ్డి, సతీష్ గౌడ్, హన్మాండ్లు, రఫీ, పాపయ, సుభాష్, గంగారాం, రాములు, మైత్రి గంగారాం, మైత్రి భూమయ్య, సిద్దు, సైదయ్య, రవి, లింగం, బోయిని గంగాధర్, బసోల్ల గంగారాం, తోట గంగారాం, సాయిలు, నీరడి సాయిలు ,మల్లు గొండ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.