బీఆర్ఎస్ తోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి

నవతెలంగాణ-గోవిందరావుపేట
టిఆర్ఎస్ పార్టీతోనే గ్రామీణ ప్రాంతాలు పూర్తిస్థాయిలో అభివృద్ధిని సాధించాయని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లాద అన్నారు. శుక్రవారం మండలంలోని బాలాజీ నగర్ పంచాయతీ పరిధిలోని సండ్రగూడెం గ్రామంలో సర్పంచ్ ఇస్లావత్ మౌనిక వినోద్ ఆధ్వర్యంలో నూతన సీసీ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ప్రహ్లాద హాజరై పూజారి కార్యక్రమాలు నిర్వహించి రహదారి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద మాట్లాడుతూ.. ఈరోజు ప్రతి గ్రామంలో ఆశించినంత మేర అభివృద్ధి జరిగింది అంటే అది బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమైందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాంనగర్ సర్పంచ్ భూక్యా మోహన్. లక్ష్మీపురం సర్పంచ్ లావుడ్య స్వాతివాగ. మాలోత్ గాంధీ. లావుడ్య గణేష్ లాల్.జర్పుల జగన్. లాకావత్ నర్సింహా.భూక్యా వెంకటేష్.లాకావత్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.