తండాల అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

– గులాబీ సత్తా చూపాలె…
– మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలి
– తండాబాటలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ-పెద్దవంగర
పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమ నా రెండు కళ్ళు అని, గులాబీ సత్తా చూపాలె.. మరో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. తండా బాట కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని పలు తండాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేపట్టారు. అంతకుముం దు మంత్రి ఎర్రబెల్లికి తండాల్లో ప్రజలు కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, బతుకమ్మలతో సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. మండల పరిధిలోని కొత్త తండా, మేగ్య తండా, బలుసుల కుండ తండా, ఏనమీ ది తండా, అమర్‌ సింగ్‌ తండా, శంకర్‌ తండా, బొత్తల తండా, రంగి తండా, బత్తాయితోట తండా, భద్రు తం డా, పోచారం, చక్రం తండా, సర్పంచ్‌ తండా, జాసలి తండా, వంపు తండా, శంక్రు తండా, అదుర్‌ తండాల్లో మంత్రి ఎర్రబెల్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారి కష్టసుఖాలను తెలుసు కున్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో గిరిజన తండాలు అభివృద్ధి కి నోచుకోలేదన్నారు. కనీసం తాగడానికి కూడా నీరు లేక తండ్లేవారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తండాల రూపురేఖలను మార్చిందన్నారు. తండావాసు లు గతాన్ని గుర్తుచేసుకొని, అభివృద్ధికి ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హ్యాట్రి క్‌ విజయం సాధించడం ఖాయమని ధీమావ్యక్తం చేశా రు. కాంగ్రెస్‌,బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మొ ద్దని ప్రజలకు సూచించారు. అనంతరం పలు తండా ల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి మంత్రి ఎర్రబెల్లి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షు డు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, గోపాల్‌ రావు, సో మేశ్వర్‌ రావు, సీనియర్‌ నాయకులు కేతిరెడ్డి సోమన ర్సింహా రెడ్డి, శ్రీరాం సుధీర్‌, ముత్తినేని శ్రీనివాస్‌, శ్రీ రాం సంజరు కుమార్‌, ఎంపీటీసీ సభ్యులు బానోత్‌ ర వీందర్‌ నాయక్‌, ఏదునూరి శ్రీనివాస్‌, బానోత్‌ విజయ సోమన్న, ఈరెంటి అనురాధ శ్రీనివాస్‌, నాయకులు బొమ్మెరబోయిన రాజు, గాంధీ నాయక్‌, ఆంజనేయు లు, యూత్‌ అధ్యక్షుడు కాసాని హరీష్‌, అనుదీప్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు చిలుక బిక్షపతి, కుమార్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.