అందరి సహకారంతో నగరం అభివృద్ధి

– బల్దియా కమీషనర్‌గా షేక్‌ రిజ్వాన్‌ బాషా బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ-వరంగల్‌
అందరి సహకారంతో నగరం లో అభివద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ కమీషనర్‌ గా షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదివారం సాయంత్రం ప్రధాన కార్యాలయం లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రములోని ఒంగోలు జిల్లా ,2017 బ్యాచ్‌ , మొదటగా రాజన్న సిరిసిల్ల జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లో అదనపు కలెక్టర్‌ గ 3నెలలుగా, అనంతరం అదిలాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ పని చేసి వరంగల్‌ మహ నగరపాలక సంస్థ కమిషనర్‌ గా ఆదివారం సాయంత్రం 6:18 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలల తరువాత పూర్తి స్థాయి కమిషనర్‌ నియామకం కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అదనపు కమీషనర్‌ అనిస్‌ ఉర్‌ రషీద్‌, సీ.ఎం.హెచ్‌.ఓ. డా.రాజేష్‌, సీ.హెచ్‌.ఓ. శ్రీనివాసరావు, పిఆర్‌ ఓ ఆయూబ్‌ అలీ, జాక్‌ అద్వక్షులు గౌరీ శంకర్‌, ఆర్‌ ఓ షాహ్జాది బేగం, పర్యవేక్షకులు రావుల ఆనంద్‌, సంతోష్‌,సిబ్బంది తదితరులు కమిషనర్‌ ను మర్యాదపూ ర్వకంగా కలసి మొక్కలను అందజేసి శుభా కాంక్షలు తెలిపారు.విభాగాల వారిగా అధికా రులతో పరిచయం చేసుకున్న కమీషనర్‌ అనంతరం మాట్లాడుతూ జీ డబ్ల్యూ ఎంసీ పరిధిలో వివిధ పథకాల క్రింద ఆయా విభాగాల ద్వారా కొనసాగుతున్న, పెండింగ్‌ లో ఉన్న, చేపట్టబోయే అభివద్ధి పనుల అప్డేటెడ్‌ సమాచారం సంబంధిత విభాగ అధికారుల వద్ద సిద్ధంగా ఉండాలని, విభాగాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని ఈ సందర్భంగా కమీషనర్‌ అన్నారు.