– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
నవతెలంగాణ- తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, సబండవర్గాలు సంతోషంగా ఉన్నాయని తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం, సంగెం, గుడితండ గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని, తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, 60 సంవత్సరాలుగా నమ్మి మోసపోయారని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సాగు త్రాగునీరుతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. 2014 ముందు నియోజకవర్గంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు 10,000 మాత్రమేనని నేడు 50,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, అన్నారు. కెసిఆర్ పాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. దళిత బంధు, రైతుబంధు, బీసీ బందు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, కెసిఆర్ కిట్టు, గృహలక్ష్మి, లాంటి పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం తుంగతుర్తి నియోజకవర్గం బీడు భూములతో కరువు కాటకాలతో ఉండేదని, నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా ఉందని అన్నారు. 2014 ముందు అన్నారం, సంగెం గ్రామాలలో హత్య రాజకీయాలతో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనలో ఉండేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హత్య రాజకీయాలకు చరమగీతం పాడటం జరిగిందని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరో మారు ముఖ్యమంత్రి కేసీఆర్ కావాల్సిందేనని, తుంగతుర్తిలో గులాబీ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. అన్నారం గ్రామ ప్రజల స్వాగతోత్సవ ర్యాలీని చూస్తుంటే, విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నంత సంతోషంగా ఉందని, ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు, రాష్ట్ర నాయకులు యుగంధర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు దొంగరి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, అన్నారం గ్రామ పార్టీ అధ్యక్షులు అండెం వెంకట్ రెడ్డి, ఏటేర్గు శ్రీనివాస్ రెడ్డి, రేగటి శ్రీనివాస్, పోగుల రామకృష్ణారెడ్డి, కుంచాల వీరారెడ్డి, ఎంపీటీసీ వంటల కృష్ణ, మట్టపల్లి వెంకట్, బెడద రాములు, సోమశేఖర్, పోతరాజు, పోగుల శ్రీకాంత్ రెడ్డి, జటంగి సత్యనారాయణ, ఉప్పుల సైదులు, మండల పరిధిలోని వివిధ గ్రామాల కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.