– హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి
నవతెలంగాణ-కోహెడ
రాష్ట్రంలో మారుమూల గ్రామాలను అభివృద్ది చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శనివారం పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బత్తులవానిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మారుమూల గ్రామాలలోని ప్రజల సమస్యలు ప్రభుత్వం పట్టిచుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు బత్తులవానిపల్లేకు రోడ్డు, మంచి నీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. తెలంగాణలో అభివృద్ది కేవలం కేసీఆర్ కుటుంబాలకు చెందిన మూడు నియోజకవర్గాలలో మాత్రమే జరిగిందని, మిగతా నియోజకవర్గాలలో అభివృద్ధి శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. పేదవారికి సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు బస్వరాజు శంకర్, పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, మాజీ సర్పంచ్ శెట్టి సుధాకర్, వరికోలు ఎంపీటీసీ జయరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు లింగాల కుమార్, ఈర్ల రాజయ్య, ఎస్సీసెల్ అధ్యక్షులు చింతకింది శంకర్, కిసాన్ సెల్ అధ్యక్షులు భీంరెడ్డి తిరుపతిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దూలం శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బందెల బాలకిషన్, వేల్పుల వెంకటస్వామి, సంగెం కిషన్, యాళ్ళ శ్రీనివాస్‌రెడ్డి, వెన్న రాజు, శనిగరం తిరుపతి, తాటిపాముల ప్రవీణ్, పేరుక రామచంద్రం, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మంద దయాకర్, సుదగోని మధు, యూత్ కాంగ్రెస్ జిల్లాప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సనత్‌రెడ్డి, మాడుగుల చింటు, రంజిత్, కార్తిక్, అంజి, కార్యకర్తలు, తదితరులు పాల్గోన్నారు.