కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
అభివద్ధి పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. సోమవారం గోల్నాక డివిజన్ పరిధిలోని సోమవారం డివిజన్‌లోని న్యూ అంబేద్కర్ నగర్, దుర్గానగర్, అన్నపూర్ణ నగర్‌లలో పర్య టించి అభివద్ధి పనులను పరిశీలించారు.ఆమె మాట్లా డుతూ బస్తీలలో ప్రతిసారి వర్షాకాలం వరద నీరు ఇండ్లను ముంచేత్తుతుందని తెలిపారు. వరద ముంపు నుంచి బస్తీ లను రక్షించుకునే దిశగా రూ.14లక్షలతో కొత్తగా పైప్‌లైన్ పనులను చేపట్టి నట్లు తెలిపారు. పనులు పూర్తయితాయని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ డీఈ ప్రవీణ్ కుమార్, వర్క్ ఇన్‌స్పెక్ట్టర్ మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.