పోలీస్‌ షూటింగ్‌ ఛాంపియన్‌ విజేతలకు డీజీపీ అభినందనలు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గచ్చిబౌలిలో నిర్వహించిన రాష్ట్ర పోలీసు షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న పోలీసు అధికారులను డీజీపీ అంజనీ కుమార్‌ అభినందిం చారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో విజే తలకు శాలువా కప్పి, షీల్డ్‌లను, పతకాలను డీజీపీ అందజేశారు. 2023- 24 సంవత్సరానికి గానూ గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్ర పోలీసు షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇన్‌స్పెక్టర్లు మొదలుకొని కానిస్టేబుళ్లవరకు 8 మంది అధికారులు వివిధ రేంజ్‌ల ఫైరింగ్‌లలో బంగారు, వెండి, కాంస్య పతకాల ను సాధించారు.
పతకాలు సాధించిన అధికారులలో ప్రసన్న కుమార్‌, శంకర్‌, సైదులు, రాజ్‌కుమార్‌, శ్రావణి, మాధవి, శ్రీనివాస్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యంత ప్రతిభను కనబర్చి ఈ అధికారులు పోలీసు శాఖ పేరును నిలబెట్టారని అన్నారు. ఏకాగ్రత, పట్టుదలను పెంపొందించటంలో షూటింగ్‌ క్రీడ ఎంత గానో దోహదపడుతుందనీ, వీరు త్వరలో జాతీయ స్థాయిలో జరిగే ఆలిం డియా పోలీసు, షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో పాల్గొని బంగారు పతకాలను సాధిస్తారని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు సంజరు కుమార్‌ జైన్‌, అభిలాష బిస్త్‌, మహేశ్‌ భగవత్‌, కమలాసన్‌రెడ్డి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.