బూర్జువా రాజకీయ పార్టీ నాయకులు నిరంకుశ పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తరుణంలో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని బూడిద సునీల్ అన్నారు. ధర్మ సమాజ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బూడిద సునీల్ ను ప్రకటించగా వారు రాయపర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల కోసం ఎన్నికల బరిలో నిలుస్తున్న ధర్మ సమాజ్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. విద్యావంతులు, మేధావులు తమ సంపూర్ణ మద్దతును తమకే అందించాలని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల బరిలో గెలవాలంటే డబ్బు, మద్యం ఆయుధం కాదనేది ప్రజలు నిరూపించాలన్నారు. ఓటు ఒక వజ్రయుధం వంటిదని దానిని ఐదు సంవత్సరాల బంగారు భవిష్యత్తు కోసం వినియోగించాలని అన్నారు. టార్చ్ లైట్ గుర్తుతో వస్తున్న తమ పార్టీకి ప్రజలు కొండంత అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జిల్లా నాయకుడు దామెర శ్రావణ్, ఠాగూర్నాథ్, డీఎస్పీ మండల అధ్యక్షుడు గారె వెంకటస్వామి, సదానందం, గణేష్, స్వామి, సతీష్, కరుణాకర్, శ్రీను, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.