నవ తెలంగాణ- రామారెడ్డి: మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం హమాలీ రోడ్డుపై ద్విచక్ర వాహనాలను అడ్డుపెట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. స్థానిక హమా లీలను కాదని, హమాలీల పొట్టు కొట్టడానికి సొసైటీ అధికారులు, స్థానిక వరి కొనుగోలు సెంటర్ నిర్వాహకులు కుమ్మకై బీహార్ నుండి కూలీలను తెచ్చి, స్థానికులకు పని లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో హమాలీలు పాల్గొన్నారు.