అనుమతి లేకుండా ధర్నా చేసి పబ్లిక్ ట్రాఫిక్ కి అంతరాయం

నవతెలంగాణ- ఆర్మూర్ :  వేల్పూర్ x రోడ్డు వద్ద నేషనల్ హైవే 63 జాతీయ రహదారి పై ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ధర్నా చేసి పబ్లిక్ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించి ఇబ్బంది కలుగచేసిన నిజామాబాద్ కు చెందిన నవతే ప్రతాప్, కొంతమంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై  కె. వినయ్ శనివారం తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమలు లో ఉన్నందున ఎవరు కూడా పెర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేయడం, సభలు నిర్వహించడం, పొలిటికల్ సర్వేలు చేయడం లేదా రెచ్చగొట్టే విదంగా పోస్టులు సోషల్ మీడియాలలో పెట్టడం చేస్తే చట్ట ప్రకారం కేసు లు నమోదు చేయబడతాయి అని అన్నారు.