ఎల్‌డీఎఫ్‌ ఇండియాతో డిక్కీ జట్టు

– దళిత బంధు లబ్దిదారులకు మద్దతు
హైదరాబాద్‌ : దళిత బంధు పథకం లబ్దిదారుల ప్రయోజనం కోసం పశుసంపద, పాడి, మత్స్య పరిశ్రమలలో వ్యాపార అవకాశాలను అంది పుచ్చుకోవడానికి ఎల్‌డీఎఫ్‌ ఇండియా ఎక్స్‌పో నిర్వాహకులతో డిక్కీ జట్టు కట్టింది. ఆయా రంగాల్లో అవకాశాల గురించి అవగాహన కల్పించ డానికి, వ్యాపారాన్ని ప్రారంభించడానికి, వ్యాపారాన్ని ప్రారంభించడంలో సహాయ పడటానికి చేతులు కలిపాయి. సోమవారం నగరంలోని హైటెక్స్‌లో విలేక రుల సమావేశంలో డిక్కీ కోఆర్డినేటర్‌ నారాయణ దాసరి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో తొలిసారిగా ఈ పథకం కింద ప్రభుత్వం రూ.18000 కోట్లు పంపిణీ చేసిందన్నారు. అనంతరం ఇతర ప్రాంతాలకు విస్తరించారు. మొదటి దశలో దాదాపు 32000 మంది లబ్ది పొందారు. చాలా మంది లబ్దిదారులు రవాణా రంగంలో వ్యాపారాలు స్థాపించారు. పశుపోషణలో 2000, డెయిరీలో 1800 నుంచి 2000, మేకల పెంపకంలో 1500 యూనిట్లు ఏర్పాటు చేశారన్నారు. డిక్కీ నెక్ట్స్‌ జెన్‌ కన్వీనర్‌ అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ”వాటిలో కొన్ని తెలివైన పెట్టుబడులు, మరికొన్ని అంత తెలివైనవి కావు. వ్యాపారాన్ని మరింత తెలివిగా ఎంచుకోవడానికి వారిని హ్యాండ్‌హోల్డ్‌ చేయడానికి డిక్కీ అడుగు పెట్టింది.” అని అన్నారు.