నవతెలంగాణ – చండూరు
స్థానిక డాన్ బోస్కో జూనియర్ కళాశాల ను శుక్రవారం డిఐఈఓ దస్రు నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాన్ బోస్కో విశాలమైన స్థలంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడమైందని, అనుభవజ్ఞులైన , అంకిత భావం గల అధ్యాపకులతో సేవా దృక్పథంతో , ఫాదర్స్ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో విద్యను గ్రామీణ స్థాయిలో విద్యార్థులకు విద్యను అందిస్తుందని అన్నారు. ఇంటర్మీడియట్ విద్య విద్యార్థి దశలో కీలకమైంది అన్నారు. చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని ఆయన కోరారు. అనంతరం ఆయనను సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ బాల శౌరి రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.