గిరిజన గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సంచాలకులు 

నవతెలంగాణ సైదాపూర్ : రాష్ట్రవ్యాప్తంగా  గ్రామాల పారిశుద్ధ్యన్ని  మెరుగుపరచడంలో భాగంగా చేపట్టిన సానిటేషన్ డ్రైవ్ ను పర్యవేక్షించడానికి సహాయ సంచాలకులు  విజయరావు  కమిషనర్ గ్రామీణ అభివృద్ధి శాఖ హైదరాబాద్ కరీంనగర్ జిల్లాలోని ఏకైక గ్రామమైన రాయికల్ తాండ ను సందర్శించారు.గ్రామంలో చెత్త నిర్వహణ మురికినీటి నిర్వహణ గ్రామ పారిశుద్ధ్యం సగ్రిగేషన్ షెడ్ వినియోగం నర్సరీ వైకుంఠధామలను పరిశీలించారు. గ్రామ పారిశుద్ధాన్ని సుస్థిరంగా కాపాడాలని సూచించారు. ఇంత మారుమూల గ్రామమైన పారిశుధ్యంలో మిగతా గ్రామాలతో పోటీ ఉందని అభినందించారు. వీరి వెంట జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ రమేష్ ఎంపీడీవో పద్మావతి ఎంపీవో సురేందర్  ఏపీవో  యూనిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ రవీందర్ గ్రామ సర్పంచ్ అక్షయ శ్రీనివాస్  గ్రామపంచాయతీ కార్యదర్శి మండల మరియు గ్రామ అధికారులు పాల్గొన్నారు.