ఈతకెళ్లిన యువకుడు అదృశ్యం

నవతెలంగాణ-హయత్‌నగర్‌
బావిలో ఈతకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హయత్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలి పిన వివరాల ప్రకారం…ఎన్‌ నగర్‌ ఎన్‌టీఆర్‌ నగర్‌లో అబ్దుల్‌ రజాక్‌ తన భార్యతో కలిసి నివాసం ఉంటు న్నాడు. హయత్‌ నగర్‌లోని పెద్ద మసీదు వెనుక ఉన్న సీతారాం బావిలో అతను ఈతకు వెళ్ళాడు. కానీ ఎంతకీ బయటకు రాలేదు. ఈ విషయాన్ని గమనించిన పక్కనున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి హయత్‌ నగర్‌ పోలీసులు చేరుకున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు. కానీ అతని ఆచూకీ లభించలేదు. మరో విషయం ఏమిటంటే అతనికి ఈత రాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.