– ప్రణయ్, లక్ష్య పరాజయం
– చైనా ఓపెన్ సూపర్ సిరీస్
చాంగ్జౌ (చైనా) : ఆసియా క్రీడల ముంగిట భారత స్టార్ షట్లర్లు నిరాశపరిచారు. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ 100 టోర్నీలో మన రాకెట్లకు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నం.6 హెచ్.ఎస్ ప్రణయ్, యువ ఆటగాడు లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే ఓటమి చెందారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మ్యాచ్‌లో ప్రపరప చాంపియన్‌షిప్స్ మెడలిస్ట్ ప్రణయ్ 12-21, 21-13, 18-21తో మూడు గేముల పోరులో మలేషియా షట్లర్ జె యాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 66 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ ఓడిన ప్రణయ్.. రెండో గేమ్‌లో గెలుపొంది లెక్క సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. వరల్డ్ నం.22 జె యాంగ్ అనూహ్యంగా ప్రణయ్ పై గెలుపొందాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో వరల్డ్ నం.1 విక్టర్ అక్సెల్సన్‌కు షాక్ ఇచ్చి పతకం సాధించిన ప్రణరు.. చైనా ఓపెన్‌లో అంచనాలను అందుకోలేదు. యువ ఆటగాడు లక్ష్యసేన్ 21-13, 21-16, 9-21తో ఆంటోన్సెన్ (డెన్మార్క్)కు తలొగ్గాడు. 78 నిమిషాల మారథాన్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ పోరాడినా ఫలితం లేకపోయింది. మెన్స్ సింగిల్స్‌లో మరో మ్యాచ్ ప్రియాన్షు రజావత్ 13-21చ 24-26తో ఇండోనేషియా షట్లర్ హిరెన్‌తో పోరాడి ఓడాడు. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి జంట 18-21, 11-21తో వరుస గేముల్లో టాప్ సీడ్ చైనా జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌లో ఎం.ఆర్ అర్జున్, ధ్రువ్ కపిల జోడీ 21-23, 19-21తో జపాన్ షట్లర్లతో పోరాడి ఓడారు.