గిరిజన సంబరాల్లో ఎరుకల పై వివక్ష

– ఎంపిడివో, ఎంపీపీ తీరుపై ఆగ్రహం
– ఏకలవ్య నాయకుల మండిపాటు
నవతెలంగాణ – దుబ్బాక, దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజనోత్సవంలో తమ ఎరుకల తెగపై తీవ్ర వివక్ష చూపారని,ఈ సంబరాల్లో ఏకలవ్య నాయకులను ఆహ్వానించకపోవడం పట్ల ఏకలవ్య సంఘం రాష్ర్ట నాయకులు వనం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం దుబ్బాకలో విలేకరులతో ఆయన మాట్లాడారు.దుబ్బాక మండలంలో గిరిజనులే ఉన్నారా అని ఎరుకల తెగలు గిరిజనుల కిందికి రారా అని,వారు కనబడడం లేదా? అని ప్రశ్నించారు. తమ ఎరుకల తెగపై ఎంపీపీ, ఎంపీడీవోలు తీవ్ర వివక్ష చూపారంటూ ధ్వజమెత్తారు. ఇది సరైన పద్ధతి కాదని ఇకనైనా అధికారులు ,ప్రజాప్రతినిధులు వారి తీరును మార్చుకోవాలని సూచించారు.