వివక్ష కుటుంబం నుండే మొదలవుతుంది

Discrimination starts from the family itselfలింగ వివక్ష, మూస పద్ధతులను బద్దలు కొట్టుకొంటూ వెల్స్‌ ఫార్గోకు చెందిన హేమ శర్మ తన కెరీర్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. టెక్నాలజీ రంగంలో ఆమె తన 23 ఏండ్ల ప్రయాణం, విభిన్న అనుభవాలను మనతో పంచుకుంటుంది. అలాగే శతాబ్దాలుగా సమాజంలో మహిళలను వెనక్కి నెట్టివేస్తున్న అణిచివేత, లింగ వివక్ష గురించి ఆమె ఏమంటున్నారో తెలుసుకుందాం…
హేమ 1990ల ప్రారంభంలో ఢిల్లీలోని ఒక కళాశాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ కోసం నమోదు చేసుకున్నప్పుడు, 42 మంది విద్యార్థులతో కూడిన ఆ తరగతిలో ఎనిమిది మంది బాలికలలో ఆమె ఒకరు. బాలికలు ప్రతిరోజూ క్యాంపస్‌లో సాధారణం లింగ విక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు. కాలేజీలో అబ్బాయిల సీట్లు అమ్మాలు ఆక్రమించేస్తున్నారని, పెండ్లి చేసుకొని పిల్లల్ని కనాల్సిన వారు ఇంజినీరింగ్‌ చదవడం అవసరమా అంటూ నానా మాటలు అనేవారు.
కామెంట్‌ చేశారు
‘మొదటిసారి మేము కాలేజీకి వెళ్ళినపుడు అందమైన మహిళలు ఎలా ఉండరు అంటూ ర్యాగింగ్‌లో అబ్బాయిలు మాపై జోక్‌లు వేశారు. మా నడక, ధరించే బట్టలు, వస్తువులపై అనేక కామెంట్లు చేశారు’ అని హేమ గుర్తు చేసుకున్నారు. 23 ఏండ్లకుపైగా ఉన్న కెరీర్‌లో ఆమె ట్రైసాఫ్ట్‌, సేపియంట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్స్‌ వంటి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆమె టెక్నాలజీ డైరెక్టర్‌ – ఎంటర్‌ప్రైజ్‌ ప్రొడక్ట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ లీడ్‌, ఇండియా (ఔఱు) ఫిలిప్పీన్స్‌లో వెల్స్‌ ఫార్గో అండ్‌ కో-చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
మెషీన్‌ అనుభం లేదని
‘చదువు పూర్తి చేసిన తర్వాత కూడా అనేక విషయాల్లో లింగ వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాము. షాప్‌ ఫ్లోర్‌లో పాత్రల కోసం మహిళలను తీసుకోవ డానికి చాలా కంపెనీలు పూర్తిగా నిరాకరించాయి. నేను ఒక కంపెనీలో ఉద్యోగం కోసం రెండు రాతపూర్వక రౌండ్‌లను పూర్తి చేసిన తర్వాత తదుపరి దశకు నన్ను పిలిచారు. అయితే ఆ రౌండ్‌ మెషీన్‌ అనుభవానికి సంబంధించినదని దాని నుండి నన్ను నేను మినహాయించారు. నాకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. వాళ్లు అమ్మాయిలను ఫ్లోర్‌ జాబ్స్‌కి తీసుకోమని బహిరంగంగా చెప్పినట్టు అనిపించింది’ అని ఆమె చెప్పారు.
వివక్షను ఎదుర్కొంది
ఆమె మొదటి ఉద్యోగం మార్కెటింగ్‌ పాత్రగా మారింది. అది ఆమె కోరుకున్న ఉద్యోగం కాదు. ఇక్కడ ఆమె ఎటువంటి భేదాభిప్రాయాన్ని ఎదుర్కోలేదు, కానీ ఎదగడానికి అవకాశం లేవు. దాంతో కొన్ని నెలల అయిష్టంగానే అందులో కొన సాగింది. ఇన్‌ఫ్లుయెన్స్‌ అనే ట్రేడింగ్‌ హౌస్‌లో నాలుగేండ్లు పనిచేసిన తర్వాత 2000లో దేశంలోకి పెద్దఎత్తున ప్రవేశించిన ఐటీ బూమ్‌లో భాగం కావాలని నిర్ణయించుకుంది. ఒక ఐటీ కంపెనీలో డెవలపర్‌గా చేరింది. అక్కడ సుమారు ఐదేండ్లు కొనసాగింది. అయితే వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. తర్వాత ఆమె ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికాం ఇంజనీర్స్‌, ఆ తర్వాత ట్రైసాఫ్ట్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా చేరింది. తన కెరీర్‌లో ఒక దశాబ్దానికి పైగా పబ్లిసిస్‌ సేపియంట్‌లో గడిపింది.
నాయకత్వం వహిస్తున్నారు
ఎజైల్‌ అనుభవం పబ్లిసిస్‌ సేపియంట్‌లో హేమ తన ప్రయాణాన్ని ఎజైల్‌ (ఒక రకమైన సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ మెథడాలజీ)తో ప్రారంభించింది. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌గా మారింది. లాయిడ్స్‌, హెచ్‌ఎస్‌బిసి వంటి క్లయింట్‌లతో కలిసి పనిచేయడానికి కొన్నేండ్ల పాటు ఆమెను లండన్‌కు తీసుకెళ్లింది. 2019లో హేమ వెల్స్‌ ఫార్గోలో చేరారు. ఇప్పుడు భారతదేశం, ఫిలిప్పీన్స్‌లో కంపెనీకి ఎజైల్‌ పరివర్తనకు నాయకత్వం వహిస్తుంది. ‘గతంలో నేను బ్యాంకులకు థర్డ్‌-పార్టీ కాంట్రాక్టర్‌లా ఉన్నాను. ఇక్కడ నేను బ్యాంకుతోనే ఉన్నాను. వెల్స్‌ ఫార్గో అందించే స్కేల్‌ ప్రత్యేకమైనది. నేను ఇక్కడ పని ప్రారంభించినప్పుడు భారతదేశంలో చురుకైన పాత్ర పోషించాము’ ఆమె వివరిస్తుంది.
సమాన భాగమని భావించేలా…
శర్మ వెల్స్‌ ఫార్గోలో (ఔఱు) (ఉమెన్‌ ఇన్‌ టెక్నాలజీ) చాప్టర్‌కు కో-చైర్‌గా కూడా ఉన్నారు. ఔఱు అనేది వెల్స్‌ ఫార్గో టెక్నాలజీలో పనిచేసే మహిళలకు మద్దతు ఇచ్చే న్యాయవాద సమూహం. ‘మా ఉద్దేశం వెల్స్‌ ఫార్గోలో మహిళల ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచడం. మహిళలు సంస్థలో సమాన భాగమని భావించే సంస్కతిని సష్టించడం. మేము గ్లైడ్‌ ప్రోగ్రామ్‌ కూడా ఏర్పాటు చేశాం. ఇది విరామం తర్వాత మహిళలను తిరిగి పనిలోకి స్వాగతించేలా చేస్తుంది. సీనియర్‌ వ్యక్తులు, పురుషులు, మహిళలు ఇద్దరూ నాయకులుగా, అనుబంధ ప్రోగ్రామ్‌గా మారడానికి సహాయపడే బోల్డ్‌ ప్రోగ్రామ్‌ ఇది’ అని ఆమె చెప్పింది.
ఉత్సాహంగా ఉండలేకపోతున్నారు
టెక్‌ కెరీర్‌లో మహిళలు తమను తాము నిలబెట్టుకోవడం ఎందుకు కష్టంగా ఉంది అనే విషయంపై హేమ మాట్లాడుతూ, పని ప్రదేశంలో, ఇళ్లలో సరైన మద్దతు లభించనందున వారు తమ పని పట్ల అంత ఉత్సాహంగా ఉండలేకపోతున్నారు. అందుకే తరచూ ఉద్యోగాలు మానేస్తుంటారు. ‘నా అనుభవంలో మేము వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, తగినంత దఢంగా వారిని తయారు చేయడం వంటికి చేస్తుంటాము. ఎవరైనా మేము సరైన స్థాయిలో లేమని చెబితే వారి అభిప్రాయాన్ని అంగీకరిస్తాం. నిరూపించుకోండి అంటూ వారిని మేము ఎదురు ప్రశ్నించము’ అంటూ ఆమె వివరించింది.
సరిహద్దులు గీయని పని ప్రదేశం
‘మహిళలు ఉద్యోగంలో చేరక ముందు నుండే వివక్షను అనుభవి స్తున్నారు. ఇది మన కుటుంబాలు, సమాజాల నుండి మొదల వుతుంది. ఈ వివక్షే పని ప్రదేశంలో కూడా కొనసాగుతుంది. ‘కార్యాలయ నిబంధనలను అనుసరిస్తూనే మనకు వ్యక్తిగత జీవితం ఉందని అర్థం చేసుకుంటూ సరిహద్దులను గీయగల పని ప్రదేశం మహిళలు విజయం సాధించడంలో సహాయ పడుతుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత సమాజంలో చాలామంది మహిళలు అలా చేయడం నాకు సంతోషంగా ఉంది’ అంటున్నారు హేమ.