– బ్యాంక్ మేనేజర్ పరమేశ్వర్
నవతెలంగాణ- తెలకపల్లి
పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలు దూరం అవుతాయని ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ పరమేశ్వర్ అన్నారు శుక్రవారం మండల పరిధిలోని కార్వంగ గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నాబార్డ్ వారి సౌజన్యంతో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని శివాలయం ప్రాంగణం దగ్గర గ్రామ సర్పంచ్ పెద్దలు మరియు బ్యాంక్ సిబ్బంది కలిసి పరిసరాల పరిశుభ్రత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మన వీధులలో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని అందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాజుల లక్ష్మి దేవమ్మ స్వామి, ఉప సర్పంచ్ అమరేందర్ రెడ్డి కే రమణ రెడ్డి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి కావాలికాశన్న,తోకల శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్ లు చిన్న జంగయ్య, దెంది రాంరెడ్డి, పరశురాముడు, గ్రామ పెద్దలు డి .ఆనంద్ రాగి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,రాము స్వేరో, చింత వెంకటయ్య గాజుల చందు, గాజుల నారాయణ, సామ కుర్మయ్య అజ్జు, మాధవాచారి,మొగులాల్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.