నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ లోని అసిస్టెంట్ రిజిస్ట్రార్లు గా పదవుల్లో కొనసాగుతున్న సాయ గౌడ్, విజయలక్ష్మి లకు స్థానచలనం చేశారు.సాయ గౌడ్ గతంలో ఎగ్జామ్ బ్రాంచ్, ఇష్టబ్లిష్మెంట్ సెక్షన్ ల బాధ్యతలు నిర్వహించారు. సారంగాపూర్ బీఈడీ కాలేజ్ లో విజయలక్ష్మి అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి ని ఎగ్జామినేషన్ బ్రాంచ్ బాధ్యతలు అప్పగించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయి గౌడ్ కు ఇష్టబ్లిష్మెంట్ సెక్షన్ పూర్తి బాధ్యతలు అప్పగించారు.