– సోనియాగాంధీ సమక్షంలో చేరికలు
– 17న తుక్కుగూడ బహిరంగ సభే వేదిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హస్తం గూటికి బీఆర్‌ఎస్, బీజేపీ అసంతృప్తులు రాబోతున్నారు. కాంగ్రెస్‌లో చేరే నాయకులు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రావడంతో హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 17న హైదరాబాద్‌లోని తుక్కుగూడ మైదానంలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో సోనియాగాంధీ సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోపాటు బీజేపీ బహిష్కృత నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డితోపాటు వారి అనుచరు లు కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎమ్మెల్యేలు అరెపల్లి మోహన్, వేములవీరేశం, ఏనుగు రవీందరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు కాంగ్రెస్ కండు వా కప్పుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వారితో టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రేతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా వారు చర్చలు జరి పారు. స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, ఆయా జిల్లాల్లో ముఖ్యనేత లు కూడా వారి చేరికలను స్వాగతిస్తుండటంతో కాం గ్రెస్ నాయకత్వానికి ఇబ్బంది లేకుండా పోయి ంది. అంతేకాకుండా, గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమై న నాయకులతో కూడా రేవంత్‌రెడ్డి బృందం మంత నాలు జరుపుతున్నది. దీనికి జాతీయస్థాయి నేతలు, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులను టీపీసీసీ రంగంలోకి దింపింది. బీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తులంతా కాంగ్రెస్ వైపే చూడటంతో వారి చేరికలతో పార్టీకి జరిగే లాభ నష్టాలపై కాంగ్రెస్ వ్యూహకర్తలు బేరీజు వేస్తున్నారు.